తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి తన నటన గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది రమ్యకృష్ణ.
అప్పట్లోనే తన గ్లామర్ తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.స్టార్ హోదా ను అందుకోక ముందు ఐరన్ లెగ్ అనే ముద్రను కూడా వేసుకుంది రమ్యకృష్ణ.
అంతేకాకుండా కొంత మంది దర్శకులతో విమర్శలు కూడా ఎదుర్కొంది.
ఆమె భలే మిత్రులు అనే సినిమాతో 1985లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత వరుసగా మరిన్ని సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోక పోవడంతో ఆమెకు ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు పలువురు దర్శక నిర్మాతలు.దీంతో ఆమె చాలా వరకు అవకాశాలు అందుకోకపోగా ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడుగారు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.కెరీర్ లో తనకు మంచి సక్సెస్ అందింది.
ఇక ఈ సినిమానే తన కెరీర్ కు మలుపు తిరిగింది.దీంతో ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.
చాలావరకు రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలలో నటించింది.ఈమె ప్రతి ఒక్క స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది.
ఎక్కువగా కుటుంబ, ప్రేమ నేపథ్యంలో సినిమాలలో అవకాశాలు అందుకుంది.అంతేకాకుండా పలు సినిమాలలో దేవత పాత్రల్లో నటించింది.ఇక నెగిటివ్ పాత్రలో మాత్రం ఈమెలా ఏ స్టార్ హీరోయిన్ లు కూడా నటించరని చెప్పవచ్చు.అలా మొత్తానికి తన నటనతో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
దీంతో ఆమె స్టార్ హీరోయిన్ గా మారడానికి కారణం రాఘవేంద్ర రావు అనే చెప్పాలి.
ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది రమ్యకృష్ణ.
వయసుకు తగ్గ పాత్రలలోనే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది.బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో బాగా మెప్పించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది.ఇదంతా పక్కన పెడితే ఈమె.ఒకే నటుడుతో మూడు పాత్రలు చేసింది.
ఇంతకు ఆ నటుడు ఎవరో కాదు నాజర్. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నాజర్ సహాయక పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన రమ్యకృష్ణతో కలిసి పలు సినిమాలలో అందులో వీరి మధ్య పాత్రలు తండ్రి కూతురుగా, అన్నా చెల్లెలు గా, భార్యాభర్తలుగా కనిపించారు.
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ బాహుబలిలో భార్య భర్తలు గా కనిపించారు.
ఇక రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో అన్నా చెల్లెలు గా కనిపించారు.
వంత రాజావాతన్ వరువెన్ అనే తమిళ సినిమాలో తండ్రి కూతుర్లుగా కనిపించారు.ఈ సినిమా అత్తారింటికి దారేది రీమిక్.
అత్తారింటికి దారేదిలో నదియా పోషించిన పాత్రను రమ్యకృష్ణ తమిళంలో పోషించింది.