సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని సీఎం జగన్, ప్రధాని మోదీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఆరాచకం జరుగుతుందని, పాలన ఎక్కడుందని ప్రశ్నించారు.ప్రధానికి జగన్ దాసోహం అయ్యారని, అందుకే ప్రత్యేక హోదా అడగడం లేదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్ముతున్నా.ప్రశ్నించాల్సిన సీఎం మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలున్నాయన్న ఆయన.రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.