1.తానా బాట సంయుక్తంగా నిర్వహిస్తున్న పాఠశాల వసంతోత్సవం కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారిగా పని చేసిన అకున్ సబర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు.
2.ఘనంగా బోస్టన్ లో మహానాడు
బోస్టన్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టిడిపి కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రారంభ ప్రసంగం చేశారు.
3.బ్రిటిష్ ఎయిర్ వేస్ లో ‘ తెలుగు ‘
బ్రిటిష్ ఎయిర్ వేస్ తొలిసారిగా హైదరాబాద్ లండన్ సర్వీస్ కోసం తెలుగు మాట్లాడే 20 మందిని సిబ్బందిని క్యాబిన్ క్రూ గా నియమించింది.
4.భారత్ ను పొగిడిన పాక్ మాజీ ప్రధాని
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.తాజాగా మోదీ ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. 5.శ్రీలంకలో పెరుగుతున్న ఆకలిచావులు ఆర్థిక ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి.ఎంతోమంది ఆకలి కారణంగా చనిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
6.మంకీ ఫాక్స్ కలవరం
ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతుండడం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పటివరకు 120 కేసులు వివిధ దేశాల్లో నమోదయ్యాయి.
7.శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత
శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేసినట్లు అధ్యక్ష సచివాలయం కీలక ప్రకటన చేసింది.
8.లండన్ సదస్సులో రాహుల్ కీలక వ్యాఖ్యలు
ప్రజలు చెబుతున్నది వినకుండా వారి గొంతుకను నులిమి ఎలా భారత్ లో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.అదే సమయంలో ప్రజలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ వింటోంది.ఇవి రెండు భిన్నమైన అంశాలు అంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
9.ఫామ్ ఆయిల్ పై నిషేధం ఎత్తివేత
ఫామ్ ఆయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది.
.