ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చారు.ముఖ్య నాయకులను నిన్నటి నుంచే హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు.
ఈ నేపథ్యంలో టిడిపి నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు.టిడిపి ముఖ్య నాయకులు ఎవరూ లేకపోయినా కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చి బందు పాటించడానికి వచ్చారు.
వచ్చిన కొంత మంది నాయకులను ఎప్పటికప్పుడు పోలీసులు తమ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్సి మునికృష్ణ ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు బందు పాటిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
టిడిపి చేస్తున్న బందుకు జనసేన నాయకులు మద్దతులిచ్చారు, వీరిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు
.