సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులు గతంలో చాలామంది ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా స్థిరపడ్డారు.కానీ ఇప్పుడైతే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న పోటీకి నిలదొక్కుకోలేకపోతున్నారు.
అయితే అప్పట్లో తన తండ్రి భారీ బ్యాగ్రౌండ్ ని ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ). మొదటి సినిమాకు తండ్రి సహాయం తీసుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలకు తండ్రి సహాయం లేకుండానే సొంతంగా హీరోగా ఎదిగారు నాగార్జున.ఇక ఈయన జీవితంలో ఏదైనా తప్పు జరిగింది అంటే అది కేవలం దగ్గుబాటి లక్ష్మీ ( Daggubati Lakshmi ) ని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వడమే.
విడాకుల లో విషయంలో నాగార్జున చేసిన తప్పు తప్ప ఆయన ఇంకా ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు.
ఇక లక్ష్మీతో విడాకుల తర్వాత ఆయన అమలని ప్రేమించి పెళ్లి చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చారు.కట్ చేస్తే.నాగార్జున (Nagarjuna) ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.అయితే నాగార్జున ఓ సినిమా వల్ల పెద్ద తాగుబోతుగా మారారట.
కానీ అమల ( Amala) చేసిన పనికి నాగార్జున షాక్ అయ్యారట.మరి ఇంతకీ నాగార్జున ఏ సినిమా వల్ల తాగుబోతు అయ్యారు.ఆయన చేసిన పనికి అమల ఎలాంటి షాక్ ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నాగార్జున నాని కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ ( Devadas ) సినిమా అందరూ చూసే ఉంటారు.
ఈ సినిమాలో నాగార్జున డాన్ క్యారెక్టర్ లో నటిస్తూ ఎప్పుడు మద్యపానం సేవిస్తూ ఉంటారు.
అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్ర బాగా పండడం కోసం షూటింగ్ కి వచ్చే ముందే ఇంట్లో రెండు పెగ్గుల మందు తాగి వచ్చారట.
కానీ ఈ సినిమా షూటింగ్ అయిపోయాక కూడా నాగార్జున మద్యపానం అలవాటు( Drinking Habbit )ని మానుకోలేక ప్రతిరోజు డ్రింక్ చేస్తూ ఉండేవారట.అయితే ఈ విషయం గమనించిన అమల ఇన్ని రోజులు అంటే సినిమా కోసం తాగావ్.
కానీ ఇప్పుడు సినిమా అయిపోయింది కదా ఇంకా డ్రింక్ చేయడం ఎందుకు ఆరోగ్యం నాశనం అవుతుంది అని ఎంత చెప్పినా కూడా నాగార్జున తన అలవాటుని మానుకోలేకపోయారట.కానీ అమల (Amala) ఎలాగైనా నాగార్జునని మద్యపానం మాన్పించాలి అనే ఉద్దేశంతో కొన్ని రోజులు నాగార్జునతో పూర్తిగా మాట్లాడడం మానేసిందట.
ఇంట్లోకి నాగార్జున రావడంతోనే ఎడమహం పెడ మొహం పెట్టేసరికి నాగార్జున కూడా డ్రింక్ చేయడం మానేసి మళ్లీ అమల మాట్లాడే వరకు బతిమిలాడారట.అంతేకాదు ఇంకొకసారి ఇలా మద్యపానానికి బానిస అవ్వను అని మాట ఇచ్చారట.
ఇక నాగార్జున మాటలకి అమల కన్విన్స్ అయ్యి అప్పటినుండి నాగార్జున తో మాట్లాడిందట.ఇక ఈ విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.