తెలుగులో అక్క, అమ్మ, వదిన, చెల్లెలు, తదితర పాత్రలలో నటించి తన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “ప్రగతి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే గతంలో ప్రగతి రెండు, మూడు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది.
కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో కొంతకాలం పాటు సినిమా పరిశ్రమకు దూరం అయింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటిస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
కాగా ప్రస్తుతం ప్రగతి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.అంతేగాక అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను బాగానే అలరిస్తోంది.
అయితే తాజాగా ప్రగతి జీన్స్ దుస్తులను ధరించి తీసుకున్నటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.అంతేగాక ఈ ఫోటోలకి “మీరు రోజూ చేసే పనిని మార్చేవరకు మీరు మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చలేరని” క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాక ఎప్పుడూ చీర కట్టుతో సాంప్రదాయ బద్ధంగా కనిపించే ప్రగతి ఒక్కసారిగా జీన్స్ దుస్తులు ధరించడంతో అభిమానులు ఆమె అందానికి ఫిదా అయ్యారు.
అంతేగాక జీన్స్ లో ప్రగతి చాలా అందంగా ఉందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపుగా 30 వేల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రగతికి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఏమిటో అని.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రగతి తెలుగులో భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. అలాగే ఇటీవలే మరిన్ని చిత్రాలలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఆ మధ్య ప్రగతి ఫిట్నెస్ పెంచుకునేందుకు జిమ్ లో వర్కవుట్ మరియు యోగా చేస్తూ షేర్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ బాగానే వైరల్ అవుతున్నాయి.