40 ఏళ్లు దాటినా సురేఖ లో గ్లామర్ తగ్గలేదంటూ...

తెలుగులో అక్క, అమ్మ, చెల్లి, తదితర పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులని తన సెంటిమెంట్ నటనతో ఎంతగానో కట్టిపడేసిన టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు “సురేఖ వాణి” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తలో ప్రముఖ స్వర్గీయ యాడ్ డైరెక్టర్ సురేష్ తేజను సురేఖ వాణి ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 Telugu Actress Surekha Vani Glamour Treat Adhurs, Surekha Vani, Surekha Vani Gla-TeluguStop.com

కానీ అనుకోకుండా పలు ఆరోగ్య సమస్యల కారణంగా సురేష్ తేజ మృతిచెందడంతో అప్పటి నుంచి సురేఖ వాణి ఒంటరిగా ఉంటోంది.అయితే ఈ మధ్య కాలంలో సురేఖ వాణి తన కూతురు సుప్రీత తో కలిసి పలు పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ బాగానే తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

కాగా ఇటీవలే సురేఖ వాణి పుట్టిన రోజు కావడంతో తన కూతురు సుప్రీత  తల్లి సురేఖ పుట్టినరోజు వేడుకలను తన ఇంట్లోనే అతికొద్ది మంది సమక్షంలో చాలా గ్రాండ్ గా నిర్వహించింది.అంతేకాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా షేర్ చేసింది.

అలాగే సురేఖ వాణి తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల భాషకు సంబంధించిన పాట కి స్టెప్పులు వేస్తూ ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజనులు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు.

అంతే కాకుండా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సురేఖ వాణి కి తన అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.మరికొందరైతే నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ సురేఖవాణి వన్నె తరగని అందంతో కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోందని కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

ఇంకొందరైతే ఏకంగా వయసు పెరిగే కొద్దీ సురేఖ వాణి కి అందం కూడా పెరుగుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే నటి సురేఖ వాణి మొదట్లో పలు ధారావాహికలలో నటించే అవకాశాలు దక్కించుకుని క్రమక్రమంగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కాగా ఇప్పటి వరకు సురేఖవాణి దాదాపుగా 200కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube