తెలుగులో పలు సీరియళ్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నటి నీరజ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈమె నటించిన ధారావాహికలకు బాగా కనెక్ట్ అయినటువంటి అభిమానులు ఆమెను ఇంట్లో మనిషిగా చూస్తుంటారు.
అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో నటి నీరజ పాల్గొంది.ఇందులో బాగంగా తన బుల్లితెర ప్రయాణం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో తాను అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యే “తులసీ దళం” అనే ధారావాహిక ద్వారా బుల్లితెర కు పరిచయం అయ్యానని తెలిపింది.అలాగే ఇప్పటివరకూ తాను దాదాపుగా 40 ధారావాహికలలో నటించానని, మొదట్లో తాను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో కొత్త వ్యక్తులతో పెద్దగా మాట్లాడే దాన్ని కాదని, కానీ ఎవరితోనైనా పరిచయం ఏర్పడితే వారితో తొందరగా కలిసి పోతాయని చెప్పుకొచ్చింది. ఇక తన వ్యక్తి గత జీవితం విషయానికొస్తే తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న తన పెంపుడు కుక్క పిల్ల ఇటీవల మృతి చెందిందని, దాంతో ఈ విషయం తన మనసుని ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చింది.అలాగే ఆ కారణంగానే ఇప్పటివరకు తాము పిల్లల్ని వద్దనుకున్నామని ఇకముందు కూడా కుదిరితే పిల్లలను దత్తత తీసుకొని పెంచుకోవాలని యోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నీరజ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే స్వాతి చినుకులు అనే ధారావాహికలో నటిస్తున్నట్లు తెలిపింది.అలాగే జీ తెలుగు, మా టీవీ, లలో ప్రసారమయ్యే మరో రెండు సీరియళ్లలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.
అయితే ఇప్పటి వరకు తాను నటించిన టువంటి ధారావాహికలలో ఎక్కువశాతం ఈ టీవీ ఛానల్ కి సంబంధించిన ధారావాహికలలో నటించే నటించానని అందువల్ల ఈ టీవీ ఛానల్ లో పని చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.