పలు టాలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్న స్పెషల్ సాంగ్ యూట్యూబ్ గెహనా వశిష్ట గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో నటించినటువంటి చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతోంది.
కాగా ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే గెహనా వశిష్ట ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హస్తం కూడా ఉందని తెలియడంతో అరెస్టు చేశారు.
దీంతో గెహనా వశిష్ట కూడా గతంలో తనని అరెస్ట్ చేయడం పోలీసుల తరం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది.దాంతో పోలీసులు ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని గెహనా వశిష్ట ని అరెస్ట్ చేశారు.
ఇటీవలే ఈ అమ్మడు బెయిల్ పై బయటకు వచ్చింది.అయితే ఈమధ్య పోర్నోగ్రఫీ కేసును క్షుణ్ణంగా విచారిస్తున్న పోలీసులు గెహనా వశిష్ట కి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించ లేకపోయారు.
అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి కొత్త సమాచారాన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయలేకపోయారు.దీంతో ఈ విషయం కొంతమేర గెహనా వశిష్ట కి ఊరట ఇచ్చింది.
దీంతో తొందర్లోనే ఈ అమ్మడికి కోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే గతంలో ఈ అమ్మడు డ్రగ్స్ వ్యవహారం మరియు వినియోగం కేసులో కూడా అరెస్టయింది.దీంతో అప్పట్లో కొందరు పోలీసులు తనను విడిచి పెట్టేందుకు దాదాపు 15 లక్షల రూపాయలు డబ్బు లంచంగా అడిగారని సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేకాకుండా తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తనని నిందితురాలిగా ముద్రించేందుకు కావలసిన సాక్ష్యాధారాలు కూడా తామే రెడీ చేస్తామని బెదిరించినట్లు కూడా తెలిపింది.