అమ్మ బాబోయ్ : అక్కడ ఆడవాళ్లు ఐపీఎల్ చూసారని నిషేదించారట...

ఆఫ్గనిస్థాన్ దేశంలో రోజురోజుకీ తాలిబన్ల ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయి.ఇప్పటికే దేశంలోని ధనవంతులయినటువంటి సంపన్నులను దోచుకుని తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.

 Ipl Match Live Stopped In Afghanistan, Afghanistan, Ipl 13th Season, Ipl Match-TeluguStop.com

అంతేకాకుండా ఇతర దేశాలకు చెందిన పౌరులను కూడా తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.దీంతో ఇప్పటికే పలు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో నివాసముంటున్న తమ పౌరులను ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వెనక్కి రప్పించుకున్నాయి.

అంతేగాకుండా ఈ దేశంలో నివసించే ఆడవాళ్లపై కూడా చాలా కట్టుబాట్లను విధించారు.ఈ క్రమంలో ఆడవాళ్లు బయటకు సంచరించే సమయంలో ఖచ్చితంగా బుర్కా దుస్తులు ధరించాలని అలాగే బిగుతుగా ఉన్న దుస్తులను అస్సలు ధరించకూడదని తమ ఆదేశాలను ఉల్లంఘించి ప్రవర్తించిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు.

అయితే ఇటీవలే బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ 13వ సీజన్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లను దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేస్తున్నారు నిర్వాహకులు.

దీంతో ఐపీఎల్ ప్రసారాలను ఆఫ్ఘనిస్తాన్ దేశంలో నిలిపివేయాలని ఇటీవలే తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు.అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్ లలో ఎక్కువగా ఆడవాళ్ళు కనిపిస్తున్నారని అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కూడా తాలిబన్లు లేనటువంటి కొన్ని ప్రదేశాలలో మహిళలు ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు వెళుతున్నారని అందువల్లనే తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు.

దీంతో ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాకుండా ఈ విషయం పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ రోజురోజుకి మహిళలపై తాలిబన్ల ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయని వీరి ఆగడాలను అరికట్టకపోతే భవిష్యత్తులో స్త్రీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇటీవలే ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు మహిళలు జాతీయ, రాష్ట్రీయ క్రీడలలో పాల్గొనకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రస్తుతం ప్రపంచ దేశాల వైపు దీనంగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube