కేంద్రంతో యుద్ధానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలస్తోంది.లిక్కర్ స్కాంలో కేసులో తమ కుమార్తె , ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేయడంపై గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అసెంబ్లీ వేదికగా ఐటీ, ఈడీ, సీబీఐ దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించనున్నట్లు రాజకీయ విశ్లేషకుల సమాచారం.బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తీరుపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలస్తోంది.
గవర్నర్ రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రజాక్షేత్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ప్రస్తావించేలా కేసీఆర్ వ్యూహలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సీఎం కవితకు సీబీఐ నోటీసులపై న్యాయ సలహాలు సీఎం కేసీఆర్ స్వీకరిస్తున్నారు.అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు కవిత సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తు సంస్థల దాడులపై దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో చర్చలకు ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.లిక్కర్ స్కాంలో ఇప్పటికే కవితకు సీబీఐ నోటీసులు జారీ చేశారు అధికారులు.
లిక్కర్ స్కాం కేసులో ఎల్లుండి వివరణ ఇవ్వాలని సీబీఐ అధికారలు కోరారు.అయితే ఈ విషయంపై సీఎం కేసీఆర్, కవిత ప్రగతి భవన్ భేటీ అయ్యారు.

దీనిపై ఎలా ముందుకు సాగాలనే విషయం మీద వారు చర్చించారు.దీన్ని ఎలా ఎదుర్కొనాల్సి ఉంటుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.అయితే లిక్కర్ స్కాంలో సీబీఐ నోటీసులు అందిన విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు కవిత నివాసానికి చేరుకున్నారు తాము ఉన్నామనే భరోసా ఇచ్చారు.అయితే కేసీఆర్ భేటీ అనంతరం ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీ పంపాలని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాసింది.
డాక్యుమెంట్స్ అందాకే విచారణ డేట్ ఫిక్స్ చేద్దామన్నారు.లిక్కర్ స్కాం కేసుపై అటు ప్రభుత్వ, ఇటు రాజకీయ వర్గాల్లో హీట్ పెరిగిన్నట్లు తెలస్తోంది.