ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో ఒకటైన టెలిగ్రామ్( Telegram ) యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే టెలిగ్రామ్ తమ యూజర్లకు మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది.
ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.కంపెనీలు, వారి కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్ ను పెంచడమే.
ఈ ఫీచర్ ద్వారా గ్రీటింగ్ మెసేజ్ లు( Greeting Messages ), వేగవంతంగా సమాధానాలు ఇచ్చుకోవచ్చు.అందుకోసం క్విక్ రిప్లైస్, ఇంకా ఆప్షన్లను టెలిగ్రామ్ విడుదల చేసింది.
అయితే ఈ ఫీచర్ టెలిగ్రామ్ ఉపయోగించే అందరికీ అందుబాటులో ఉండదు.కేవలం ప్రీమియర్ యూజర్లకు( Premium Users ) మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.ప్రీమియం యూజర్లు ఈ సరికొత్త ఫీచర్ ను ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు.కంపెనీలు టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా గ్రీటింగ్ మెసేజ్ లతో తమ ఛానల్ కు మొదటిసారిగా కనెక్ట్ అయిన వారికి శుభాకాంక్షలు తెలిపే మెసేజ్ పంపవచ్చు.
టెలిగ్రామ్ దీనిని ఆటోమేటిక్ గా చేసుకునే అవకాశం కల్పించింది.క్విక్ రిప్లైస్ ఫీచర్( Quick Replies Feature ) ప్రీసెట్ రిప్లై చాట్ ను అందిస్తుంది.
టెలిగ్రామ్ తమ యూజర్లకు మరొక మంచి శుభవార్త తెలిపింది.యూజర్లు తమ వ్యక్తిగత టెలిగ్రామ్ ఖాతాలను కావాలనుకుంటే బిజినెస్ ఖాతాలుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది.ఈ విషయాన్ని స్వయంగా టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు.టెలిగ్రామ్ తమ యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుందని, ఈ క్రమంలోనే మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా త్వరలోనే టెలిగ్రామ్ లో అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.