తెలంగాణ వ్యాప్తంగా ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా నేతలు కార్యాచరణ రూపొందించారు.
కరీంనగర్ లో చేపట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ మళ్లీ జిమ్మికులు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.బీజేపీ, మోదీని తిడుతూ కేసీఆర్ లబ్దిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.