జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ( Rekha Sharma ) తాజాగా మాట్లాడుతూ.పంజాబ్, తెలంగాణ, గుజరాత్‌లలోని ఎన్నారైలను( NRI ) పెళ్లి చేసుకుంటున్న మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అలానే యువతులు ఎన్నారైల బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోకుండా పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ఎన్నారైగా చెప్పుకునే ఓ వ్యక్తి పెళ్లి నెపంతో శ్రీనగర్‌కు అక్రమ రవాణా చేసిన ఉదంతాన్ని రేఖా ప్రస్తావించారు.
మతాంతర వివాహాల గురించి కూడా శర్మ మాట్లాడుతూ, వివాహాల కోసం జీవిత భాగస్వాములు తమ జీవన విధానాన్ని మార్చుకోకూడదని అన్నారు.వివిధ మతాలకు చెందిన వారు మతం మారకుండానే పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించే ప్రత్యేక వివాహ చట్టాన్ని( Special Marriage Act ) ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పెళ్లి అనేది ప్రేమ ఆధారంగానే జరగాలని, మతం ఆధారంగా కాదని నొక్కి చెప్పారు.

అమ్మాయిల తల్లిదండ్రులకు కూడా ఆమె పలు సూచనలు చేశారు.అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని, తమ కుమార్తెలకు పెళ్లి చేసి త్వరగా పంపించడంపై మాత్రమే దృష్టి పెట్టవద్దని రేఖా శర్మ కోరారు.మహిళలు పెళ్లితో ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు వివాహాన్ని ( Marriage ) ఒక మార్గంగా ఉపయోగించుకోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఎవరు మనస్తత్వం ఏంటనేది తెలుసుకోకుండా అత్యాశపడి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడితే చివరికి నిరాశే మిగులుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఎన్నారై అబ్బాయిల సంబంధాలలో కొందరికి ఆల్రెడీ పెళ్లయి ఉండొచ్చు లేదంటే వారు స్వలింగ సంపర్కులు అయి ఉండొచ్చు, ఇంకేదైనా దారుణమైన చరిత్ర వాళ్ళకి ఉండొచ్చని అందువల్ల అన్నీ పరిశీలించడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు.కొన్ని దేశాలు మోసం చేసే భర్తలకు త్వరగా విడాకులు మంజూరు చేసే అవకాశం ఉన్నందున, వివాహం జరిగే దేశంలోని చట్టాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.పెళ్లి చేసుకుని మోసం చేసిన భార్యాభర్తలను రప్పించడం పెద్ద సవాల్‌గా ఉందనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.







