లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ ( Gandhi Bhavan )లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.
పీఈసీ కమిటీ ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నారు.అలాగే ఈ భేటీకి ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పీఈసీ సభ్యులు హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.ఇప్పటికే కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను డీసీసీ అధ్యక్షులు పీఈసీ కమిటీకి పంపారు.ఈ క్రమంలో డీసీసీలు పంపిన జాబితాలో పేర్లను పీఈసీ పరిశీలించి తరువాత అర్హులైన అభ్యర్థుల పేర్లతో ఫైనల్ గా మరో జాబితాను సిద్ధం చేయనుంది.ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Central Election Committee )కి సిఫారసు చేయనుంది.
వచ్చే నెల 5, 6 వ తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాబితాలపై చర్చించనుంది.