పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ( Telangana BJP ) దూకుడు పెంచింది.ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన కమలనాథులు ప్రచార జోరును పెంచారు.
పది లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాల అమలుకు సిద్ధం అయింది.ఇందులో భాగంగా వచ్చే నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు( Bus Yatra ) నిర్వహించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ నేతలు విభజించారు.
ఈ ఐదు క్లస్టర్లలో( Five Clusters ) ఏకకాలంలో బస్సు యాత్రలు నిర్వహించనుండగా.వీటికి జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.అలాగే వచ్చే నెలలో బీజేపీ అగ్రనేతలు వరుసగా పర్యటించే విధంగా కమలం పార్టీ రంగం సిద్ధం చేస్తుంది.
ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా టూర్లు కూడా ఉండనున్నాయి.అయోధ్య అంశంతో దేశవ్యాప్తంగా అనుకూల వాతావరణం ఉందని బీజేపీ భావిస్తోంది.అలాగే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కొనసాగేలా కార్యక్రమాలను రూపొందిస్తుంది.