నేడు గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ..!

లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ ( Gandhi Bhavan )లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.

"""/" / పీఈసీ కమిటీ ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నారు.

అలాగే ఈ భేటీకి ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పీఈసీ సభ్యులు హాజరుకానున్నారు.

ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.ఇప్పటికే కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను డీసీసీ అధ్యక్షులు పీఈసీ కమిటీకి పంపారు.

ఈ క్రమంలో డీసీసీలు పంపిన జాబితాలో పేర్లను పీఈసీ పరిశీలించి తరువాత అర్హులైన అభ్యర్థుల పేర్లతో ఫైనల్ గా మరో జాబితాను సిద్ధం చేయనుంది.

ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Central Election Committee )కి సిఫారసు చేయనుంది.

వచ్చే నెల 5, 6 వ తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.

ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాబితాలపై చర్చించనుంది.

వీడియో: ఆకాశంలో ఆశ్చర్యపరిచే దృశ్యం.. మేఘాల్లో నడుస్తున్న మనిషి..??