శ్రీవారి సేవలో తెలంగాణ ఎమ్మెల్యే చందర్ పటేల్..

తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే కే.చందర్ పటేల్ దర్శించుకున్నారు.

 Telangana Mla Chander Patel Visit Tirumala , Telangana Mla , Tirumala ,andhra-TeluguStop.com

శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చందర్ పటేల్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.దర్శనానంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.

స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పధకాలు అందిస్తున్న కేసీఆర్ కారణ జన్ముడని ఆయన కొనియాడారు.

దేశంలో‌ ఉన్న పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో అందే సంక్షేమ పధకాలు అందించాలని సంకల్పంతో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టి స్ధాపించడం‌ జరిగిందన్నారు.బిఆర్ఎస్ పార్టీకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒకరికి దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.

నాల్గున్నర ఏళ్ళ కాలంలో అనేక సంక్షేమ పధకాలు అందించడం జరిగిందన్నారు.రాబోవు కాలంలో ప్రజల దీవెనలతో కేసిఆర్ విజయం సాధించనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube