హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపటిలో మంత్రివర్గం సమావేశం కానుంది.
ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.
కేబినెట్ భేటీలో ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపైనే చర్చించనున్నారు.సొంత స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల సాయంపై చర్చించడంతో పాటు ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్నారు.క్రీడా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపనుంది.తరువాత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించనున్నారని సమాచారం.అదేవిధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.