Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న నటించిన ఏకైక సినిమా ఇదే.. ఆ సినిమాలో ఏ పాత్రలో నటించాడంటే?

తీన్మార్ మల్లన్న.( Teenmar Mallanna ) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.

 Teenmar Mallanna Comedy With Venu Madhav Srimathi Bangaram Scenes Viral-TeluguStop.com

అంతేకాకుండా తీన్మార్ మల్లన్న ఒక సినిమాలో నటించాడట.వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

మరి నిజంగానే తీన్మార్ మల్లన్న సినిమాలో నటించాడా? ఆయనకు ఈ టాలెంట్ కూడా ఉందా? ఇంతకీ ఏంటా సినిమా? అన్న వివరాల్లోకి వెళితే.తీన్మార్ మల్లన్న నటించిన ఒక సినిమాలోని సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దివంగత నటుడు వేణు మాధవ్‌తో( Venu Madhav ) కలిసి తీన్మార్ మల్లన్న చేసిన కామెడీ సీన్లు అవి.

సినిమా పాతదే అయినా తాజాగా కొంత మంది ఆ సినిమాలోని సీన్లను యూట్యూబ్, ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఈ సీన్లు చూసిన నెటిజన్లు ఏంటీ మల్లన్న సినిమాలో నటించాడా? అని ప్రశ్నిస్తున్నారు.అయితే, తీన్మార్ మల్లన్న నటించిన ఏకైక సినిమా ఇది.సినిమా పేరు శ్రీమతి బంగారం.( Srimathi Bangaram Movie ) 2016లో వచ్చింది ఈ కామెడి సినిమా.

రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, రిచా సిన్హా, తీన్మార్ మల్లన్న, వేణుమాధవ్, హేమ ప్రధాన పాత్రలు పోషించారు.ఎం.వినయ్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Telugu Teenmarmallanna, Tollywood, Venu Madhav-Movie

నిజానికి ఈ సినిమా ఒకటి టాలీవుడ్‌ లో వచ్చినట్టు చాలా మందికి తెలీదు.కాబట్టి ఇందులో తీన్మార్ మల్లన్న నటించారన్న సంగతి ఎవరికి తెలుస్తుంది.అందుకే, ఈ విషయం మరుగున పడిపోయింది.

కానీ ఈ వీడియోని బయటికి తీయడంతో పాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ విషయం కాస్త చాలామందికి తెలిసింది.ఈ సినిమాలో వేణుమాధవ్, తీన్మార్ మల్లన్న స్నేహితులుగా నటించారు.

Telugu Teenmarmallanna, Tollywood, Venu Madhav-Movie

వీరిద్దరూ కార్మికులు.వేణుమాధవ్‌కు హేమ( Hema ) భార్యగా నటించారు.తాగుబోతు భర్త అయిన వేణుమాధవ్‌ను భద్రకాళీలా భార్య హేమ క్రమ శిక్షణలో పెడుతుంది.అలాంటి వాడికి మల్లన్న స్నేహితుడు.ఇద్దరూ కలిసి తాగుతుంటారు.ఈ క్రమంలో కామెడి పండించారు.

అయితే, సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న సినిమా సీన్స్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.పొలిటికల్‌గా ఆయన్ని వ్యతిరేకించేవారు అయితే ఎగతాళి చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube