రాజకీయాల్లో ఇటీవల కాలంలో టీడీపీ స్పందిస్తున్న తీరుపై ఆ పార్టీలోని సీనియర్లు కొందరు మౌనంగా గమనిస్తూ.ముచ్చటైన కామెంట్లు చేస్తున్నారు.
విజయవాడకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విషయంలో పార్టీ స్పందించిన తీరుపై సీనియర్లు గుసగుసలాడుతున్నారు.విషయాన్ని విషయంగా చూడకుండా.
పెద్దగా చేశామా? ఈ విషయంలో ఒకింత అతిగా స్పందించామా? అని చర్చించుకోవడం గమనార్హం.పట్టాభి కారుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు.
ఈ క్రమంలో పట్టాభికి కొంత గాయాలయ్యాయి.
అయితే.
దీనికి భారీ ఎత్తున కవరేజ్ ఇవ్వడం.నాయకులు గుంపులు గుంపులుగా రావడం.
పైగా పార్టీ అధినేత చంద్రబాబు సైతం క్షేత్రస్థాయిలో పర్యటనకు రావడం కూడా భారీ ఎత్తున ఎలివేట్ అయింది.అయితే.
ఇది రెండు రూపాల్లో పార్టీలో చర్చసాగింది.ఒకటి.
చిన్నది కాకపోయినా.ఇంత భారీ ఎత్తున ప్రొజెక్టు చేయాల్సిన అవసరం ఏంటి? అనేది ఒక ప్రశ్న అయితే.ఇంతకుముందు.అనేక మంది నాయకులపై అధికార పక్షం నుంచి దాడులు జరిగినప్పుడు పార్టీ అధినేత ఇంత రియాక్ట్ కాలేదు.కానీ, ఇప్పుడు మాత్రం రియాక్ట్ అయ్యారు.ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? అనే చర్చ సాగింది.

నిజానికి పట్టాభి విషయానికి వస్తే.ఇటీవల కొన్ని రోజులుగా మాత్రమే ఆయన యాక్టివ్ అయ్యారు.ముఖ్యం గా పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ.వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే విమర్శలు సైతం ఉన్నాయి.ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి బాడుగ నేతలు అంటూ సంబోధించడం, సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డిని అరెయ్ ఒరేయ్.అంటూ.
కామెంట్లు చేయడం వంటివి కూడా వివాదాలకు దారితీశాయి.దీంతో కేవలం పట్టాభిపై జరిగిన దాడి వెనుక వైసీపీనే ఉందని చెప్పలేమని.
టీడీపీలోనే గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.
ఇదిలావుంటే.
విజయవాడ టీడీపీలోనే పట్టాభి అంటే.రుసరుసలాడే నాయకులు చాలా మంది ఉన్నారని అంటున్నారు సొంత పార్టీ నేతలే.
ఈ జాబితాలో ఎమ్మెల్యే, ఎంపీ సహా మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెబుతున్నారు.ఇంత మంది ఎగస్పార్టీలను ఉంచుకుని పట్టాభి విషయంలో చంద్రబాబు ఇలా హై ఫై రేంజ్‌లో దూకుడుగా వ్యవహరించడం సరికాదనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.