అమరావతి:ఏపీలో విద్యుత్ బాదుడు అంటూ టిడిపి అసెంబ్లీ బయట నిరసన.స్మార్ట్ మీటర్ల పేరుతో రైతు మేడకు ఉరితాళ్ళు బిగిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శన.
అసెంబ్లీ బయటనుంచి పాదయాత్రగా అసెంబ్లీ లోపలికి వెళ్లిన టిడిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు.
జగన్ సీఎం అయ్యాక ఏపీలో పవర్ హాలిడే ఇచ్చారు.సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల పవర్ సెక్టార్ కుప్పకూలింది.
ముఖ్యమంత్రి చేతిలో కొందరు అధికారులు కీలుబొమ్మలా మారారు.రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం.
పులివెందుల గెలుస్తున్నామని మేము ముందు నుంచి చెప్తున్నాం ఈరోజు అదే జరిగింది.
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.
అనంతపురం లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు.దేశ చరిత్రలో గెలిచిన తర్వాత 12 గంటలైనా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ఎక్కడా లేదు.
అనంతపురం ఎస్పీ ఫకీరప్పను సస్పెండ్ చేయాలి.ముఖ్యమంత్రి పరువు ను సర్టిఫికెట్ రూపంలో రాంగోపాల్ రెడ్డి కి ఇస్తున్నారు.
సీఎం పద్ధతి మార్చుకుంటే కనీసం ఎమ్మెల్యే గా ఉంటారు.గెలిచిన అభ్యర్థిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఫకీరప్ప ఉద్యోగానికి పనికిరాడు.
ఎస్పీ,కలెక్టర్ మీద చర్యలు తీసుకునేవారకూ అసెంబ్లీ ని స్తంభింపచేస్తాం.