పవన్ పైనే భారం.. టీడీపీ వ్యూహమేంటి ?

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ( TDP ) మరియు జనసేన పార్టీలు( Janasena parties ) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని అధినేతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

 Tdp Party Believe In Pawan , Janasena Parties, Tdp , Pawan, Chandrababu , Mini M-TeluguStop.com

ఇప్పటికే ఉమ్మడి పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు.ఇకపై టీడీపీ జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమమైన కలిసే నిర్వహించేలా వ్యూహాలు రచిస్తున్నారు కూడా.

అందులో భాగంగానే ఇటీవల టీడీపీ జనసేన పార్టీలు కలిసి ఉమ్మడి మినీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసిన సంగతి విధితమే.

Telugu Ap, Chandrababu, Janasena, Manifesto, Lokesh, Pawan, Pawan Kalyan-Politic

గతంలో మినీ మేనిఫెస్టో( mini manifesto ) పేరుతో కొన్ని హామీలను టీడీపీ ప్రకటించగా ఇప్పుడు ఇరు పార్టీలు కలిసి హామీలను ప్రకటించాయి.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి ఈ రెండు పార్టీలలో ఏ పార్టీది ఆగ్రతాంబూలం అనే డౌట్ అందరిలోనూ నెలకొంది.సాధారణంగా జనసేన పార్టీతో పోల్చితే టీడీపీ బలం ఎక్కువ.

అందువల్ల ఇరు పార్టీలలో టీడీపీదే ఆధిపత్యం అని భావించారంతా.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన నీడలోనే టీడీపీ పయనించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మేనిఫెస్టోలోనూ, అలాగే ఇతరత్రా కార్యకలాపాల్లోనూ పవన్ నే హైలెట్ చేస్తూ కార్యాచరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

Telugu Ap, Chandrababu, Janasena, Manifesto, Lokesh, Pawan, Pawan Kalyan-Politic

పవన్ పైనే భారం.టీడీపీ వ్యూహమేంటి ?పవన్ పైనే భారం.టీడీపీ వ్యూహమేంటి ?దీంతో చంద్రబాబు ఏం ప్లాన్ చేస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.చివరిగా అధికారం చేపట్టి రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్న చంద్రబాబు.తాను హైలెట్ కాకుండా పవన్ ను ఎందుకు హైలెట్ చేస్తున్నారనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.

ప్రస్తుతం ఆయనను వివిధ కేసులు చుట్టుముడుతున్నాయి.ఆరోగ్య రీత్యా కూడా ఆయన రాజకీయాల్లో మునుపటి యాక్టివ్ చూపించడం లేదు.

అటు నారా లోకేష్( Nara Lokesh ) కొంత మేర యాక్టివ్ గా ఉంటున్నప్పటికి ఇంకా పరిణితి చెందాల్సిన అవసరత ఉంది.అందుకే చంద్రబాబు ఈసారి ఎన్నికలకు పవన్ ను ముందుంచి తను వెనకుండి నడిపించేలా ప్లాన్ చేస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.

మరి పూర్తిగా పవన్ పైనే భారం వేసిన టీడీపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube