TDP: ఆ ఆరు స్థానాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ

రాష్ట్రవ్యాప్తంగా టిడిపి( TDP ) తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.ఇంకా ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

 Tdp Is Unable To Decide On Those Six Seats-TeluguStop.com

చీపురుపల్లి, భీమిలి, దర్శి, ఆలూరు, రాజంపేట, అనంతపురం అర్బన్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఈ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం లో అనేక ఇబ్బందులు,  మొహమాటలు ఉండడంతో వీటిని పెండింగ్ లో పెట్టారు.

మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు( Former minister Ganta Srinivasa Rao ) తనకు భీమిలి టికెట్ కేటాయించాల్సిందిగా టిడిపి అధిష్టానం పై ఒత్తిడి చేస్తున్నారు.

అయితే గంటా ను భీమిలి నుంచి కాకుండా చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసారు.అయితే ఈ విషయంలో గంటా ఇంకా ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో, భీమిలితో పాటు చీపురుపల్లి నియోజకవర్గం పెండింగ్లో పెట్టారు.

అలాగే శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం బిజెపికి కేటాయించడంతో మరో మాజీ మంత్రి కళా వెంకట్రావు( Former Minister Kala Venkatarao ) చీపురుపల్లి టికెట్ ను తనకు కేటాయించాల్సిందిగా కోరుతున్నారు.దీంతో చీపురుపల్లికి కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది.

Telugu Ap Cm Jagan, Ap, Bhimili Tdp, Chandrababu, Janasena, Janasenani, Nelimarl

అలాగే నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించడంతో అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న బంగారు రాజు పేరును భీమిలి ( Bhimili )కి టిడిపి అధిష్టానం పరిశీలిస్తోంది.ఆయా స్థానాల్లో గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, బంగార్రాజు   విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.దీంతో వీటిని పెండింగ్ లో పెట్టారు.విజయనగరం లోక్ సభ స్థానాన్ని బిజెపి నుంచి తీసుకుని దానికి బదులుగా రాజంపేట టిక్కెట్ ను ఇచ్చే విషయంపై టిడిపి పరిశీలిస్తోంది.

అదే జరిగితే విజయనగరం లోక్ సభ స్థానానికి కళా వెంకట్రావు పేరును ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Bhimili Tdp, Chandrababu, Janasena, Janasenani, Nelimarl

అలాగే ప్రకాశం జిల్లా దర్శి విషయానికి వస్తే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ( Former minister Sidda Raghavrao )పార్టీలోకి వస్తానని చెబుతున్నారు.కానీ ఆయనపై పార్టీలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉండడంతో దర్శి నుంచి సిద్ధ రాఘవరావు కోడలు పేరును పరిశీలిస్తున్నారు.కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ స్థానానికి వీరభద్ర గౌడ్ తో పాటు, వైకుంఠం మల్లికార్జున ఆయన సోదరుడు భార్య జ్యోతి పేర్లు పరిశీలిస్తున్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ను జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడి పేరును పరిశీలిస్తున్నారు.

అనంతపురం అర్బన్ టికెట్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు.అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్ కోసం చెంగల్ రాయుడు, జగన్మోహన్ రాజుల మధ్య పోటీ నెలకొంది.

ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక  విషయం ఒక కొలిక్కి వస్తే ఆరు స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి సిద్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube