టార్గెట్ 2029 : ఏపీ పై పెద్ద ప్లానే వేసిన కాంగ్రెస్

ఏపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతుండగా, హడావుడిగా వైఎస్ షర్మిలకు( YS Sharmila ) ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటు, అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ తరపున అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది.2014 ఎన్నికల దగ్గర నుంచి ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా, కాంగ్రెస్ ప్రభావం శూన్యమే అన్నట్లుగా కనిపించింది.ఆకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్టు ప్రకటన చేసింది .అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేకపోయినా, ఎందుకు ఇంత హడావుడి అనే ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.అయితే 2024 ఎన్నికల నుంచి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయినా .కాంగ్రెస్ టార్గెట్ 2029 ఎన్నికలని, ఆ ఎన్నికల టార్గెట్ గా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

 Target 2029 Congress Has A Big Plan On Ap, Ap, Ap Congress, Jagan, Ap Cm Jagan,-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Ap Congress, Jagan, Janasena, Pcc, Telugudesam-Politics

.ప్రస్తుతం వైసీపీ, టిడిపిలలోని ( YCP , TDP )అసంతృప్తి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలని కాంగ్రెస్( Congress ) నిర్ణయించుకుంది.ఇప్పటికే పెద్ద ఎత్తున వైసిపి అభ్యర్థులను ప్రకటిస్తోంది.

టిక్కెట్లు దక్కిన వారు అసంతృప్తికి గురై ఇతర పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలో వారంతా తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే ఆ పార్టీలో టిక్కెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరి పోటీ చేస్తారని, ఆ విధంగానైనా తమ బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది.

Telugu Ap Cm Jagan, Ap Congress, Jagan, Janasena, Pcc, Telugudesam-Politics

మరికొద్ది రోజుల్లోనే రెండు పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించనున్నారు.ఈ క్రమంలో వలసలపై కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది.2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే యాక్టివ్ గా ఉంటేనే అది సాధ్యమవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.దానికి అనుగుణంగానే వైస్ షర్మిల నియామకం చేపట్టారట.

కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవడానికి గల కారణాలుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube