కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay ) కు తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం విజయ్ కు మాత్రమే ఉంది అంటే అతియసోక్తి కాదేమో.
ఈయన సినిమా వస్తుందంటే చాలు అక్కడ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ అనే చెప్పాలి.యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా కోట్లకు కోట్ల వసూళ్లను రాబట్టగలిగే సత్తా ఈయనకు ఉంది.
మరి అలాంటి బలమైన హీరో రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది.అందుకే ఈయన రాజకీయ ఎంట్రీ( Vijay Political Party )పై అక్కడ ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారు.ఇప్పటికే ఈయన రాజకీయ రంగప్రవేశంపై ఎన్నో సార్లు వార్తలు వైరల్ అయ్యాయి.మరి తాజాగా విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.
ఈయన అతి త్వరలోనే పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టు అక్కడి మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.
విజయ్ పొలిటికల్ పార్టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది.
విజయ్ తన రాజకీయ పార్టీ పేరును ఫైనల్ చేసి అతి త్వరలోనే రిజిస్టర్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పుడు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి రాజకీయాల్లోకి దిగడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు అని టాక్ వినిపిస్తుంది.మరి తమిళ్ రాజకీయాల్లో( Tamilnadu Politics ) విజయ్ ఏ పాత్ర పోషిస్తారో చూడాలి.
ప్రస్తుతం దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ”లియో” ( Leo ) సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే పూర్తి అయ్యిన ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు.
సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఇక దీంతో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు.
ఇది అతి త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.