టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తమన్నా కాంబినేషన్ లో రెబల్, బాహుబలి1, బాహుబలి2 సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాల గురించి తమన్నా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ప్రభాస్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని ఆమె తెలిపారు.
ప్రభాస్ ఇంటికి వచ్చిన గెస్ట్ లను ఏ విధంగా చూసుకుంటారో అందరికీ తెలుసని ఆమె తెలిపారు.ప్రభాస్ భోజనానికి పిలిస్తే కనీసం 30 వంటకాలు ఉంటాయని తమన్నా వెల్లడించారు.
ప్రభాస్ డబ్బు గురించి అస్సలు ఆలోచించరని ఒక నిజమైన రాజు ఏ విధంగా ఉంటారో ప్రభాస్ అదే విధంగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎంతగా ఇష్టపడతారో ప్రభాస్ కు కూడా తెలియదని తమన్నా వెల్లడించారు.

ప్రభాస్ స్టార్ హీరో అయినా సింపుల్ గా ఉంటారని ఆమె పేర్కొన్నారు.తమన్నా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ తో మరో సినిమాలో కలిసి నటించాలని తమన్నా భావిస్తున్నారని అందుకే ఆమె ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ప్రభాస్ గొప్పదనం గురించి గతంలో కూడా పలువురు హీరోయిన్లు చెప్పిన సంగతి తెలిసిందే.

తమన్నా కెరీర్ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు.తమన్నా రెమ్యునరేషన్ కూడా తక్కువగానే ఉందని సమాచారం అందుతోంది.తమన్నాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.మిల్కీ బ్యూటీ తమన్నా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తమన్నాను అభిమానించే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు.వయస్సు పెరుగుతున్నా తమన్నా గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు.
తమన్నా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని తెలుస్తోంది.