Taapsee Pannu Six Pack Abs :బాబోయ్.. తాప్సీ సిక్స్ ప్యాక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే .. ఇంత కష్టం ఎందుకో?

టాలీవుడ్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే బ్యూటీ తాప్సీ పన్ను( Taapsee Pannu ).మొదట ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సి.

 Taapsee Pannu Flaunts Her Six Pack-TeluguStop.com

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.మొదటి సినిమా మంచి హిట్ అవడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు లభించినప్పటికీ ఈమెకు హీరోయిన్ గా తగిన గుర్తింపు దక్కలేదు.

ఈమె తెలుగులో ఝుమ్మంది నాదం, వస్తాడు నా రాజు, వీర, మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, మొగుడు, దరువు,గుండెల్లో గోదారి, షాడో, ఆనందోబ్రహ్మ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు చూడకుండా బాలీవుడ్( Bollywood ) లో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తాప్సి.తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియా( Social Media )లో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇకపోతే తాజాగా హీరోయిన్ తాప్సి సిక్స్ ప్యాక్ బాడీ( Six Pack Abs )తో కనిపించి ఒకేసారిగా షాక్ ఇచ్చింది.అదేంటి హీరోయిన్ సిక్స్ ప్యాక్ ఏంటి అనుకుంటున్నారా? తాజాగా అందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకీ( Dunki ) సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే నామ్ షబానా సినిమా సీక్వెల్ లో కూడా నటిస్తోంది.అయితే ఈ స్ప్రే యాక్షన్ థ్రిల్లర్ సినిమా( Action Thriller Movie ) కోసం రెడీ అయ్యిందా లేదంటే క్యాజువల్ గాని ఇలా రెడీ అయిందా అన్నది అర్థం కావడం లేదు.

అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతా( Instagram )లో షేర్ చేసింది.ఆ ఫోటోలో తాప్సీ తో పాటు ఆమె జిమ్ ట్రైనర్ కూడా ఉన్నారు.

చాలామంది ఆ ఫోటోని చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.సిక్స్ ప్యాక్ బాడీ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube