జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పాసిగామలో ఈథనల్ ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం జరుగుతోంది.
ఈ క్రమంలో నిరసనకారులకు మద్ధతు తెలిపేందుకు వెళ్తుండగా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహా నిర్భందం చేశారు.జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.