యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన హిందీ, తెలుగు ద్వి భాష చిత్రం ఆదిపురుష్( Adipurush ) జూన్ 16వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్న విజయం తెలిసిందే.పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.
కనుక రెండు నెలల ముందు నుండే ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేయడం జరిగింది.అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో సినిమా ను స్క్రీనింగ్ చేసేందుకు గాను ఏర్పాటు జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించలేక పోయింది.

పైగా సినిమా స్థాయిని తగ్గించేలా ఉంది అనడంలో సందేహం లేదు.అందుకే ట్రైలర్ విషయం లో జాగ్రత్తగా తీసుకున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మే రెండవ వారంలో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
సినిమా విడుదలకు కనీసం నెల రోజుల ముందు అయినా ట్రైలర్ విడుదల చేయడం ద్వారా భారీ ఎత్తున పబ్లిసిటీ లభించే అవకాశాలు ఉంటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.

ఇక ఆదిపురుష్ సినిమాను చిన్న పిల్లల సినిమా అంటూ ట్రోల్స్ చేసిన కొందరికి కచ్చితంగా చంప పెట్టు అన్నట్లుగా వచ్చే నెలలో రాబోతున్న ఆదిపురుష్ ట్రైలర్ ఉంటుంది అంటూ చిత్ర యూనిట్స్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.ట్రైలర్ విడుదలైన తర్వాత ఆదిపురుష్ సినిమా గురించి జనాల్లో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారి పోతుందని.సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది చూద్దామా అంటూ ఎదురు చూస్తారని మేకర్స్ చెప్తున్నారు.

దాదాపు సంవత్సర కాలం పాటు ఆలస్యమైన ఈ సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా తో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకోవాలని దర్శకుడు( Om Raut ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ అతిపెద్ద మోషన్ గ్రాఫిక్స్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని సొంతం చేసుకోవాలంటే ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావాల్సి ఉంది.ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్య భాషల్లో విడుదల చేయబోతున్నారు.







