దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా అరెస్ట్ అయిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది.
ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది.అయితే సిసోడియా బెయిల్ ను ఈడీ వ్యతిరేకించింది.
దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.