గూగుల్ ఫొటోస్‌లో లాంచ్ అయిన సూపర్ ఫీచర్.. ఇక నుండి ఆపని చాలా తేలిక!

గూగుల్ ఫొటోస్ కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ మొబైల్ యూజర్లకు గేలం వేస్తోంది.ఇప్పటికే ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకువచ్చినప్పటికీ, ఓ సమస్య ఎప్పుడూ యూజర్ ని వెంటాడేది.

 Super Feature Launched In Google Photos , Google Photos , New Features , Latest News , Viral , New Updates , Delete Photos Directly-TeluguStop.com

అదే గూగుల్ ఫొటోస్‌లోని ఆల్బమ్‌ లలోని ఫొటోలను నేరుగా డిలీట్ చేయడం కుదిరేది కాదు.ఇలా బేసిక్ ఫీచర్ ఎప్పుడు మిస్ అవుతూ ఉండేది.

అయితే ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.అయితే కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో ఆల్బమ్స్‌లోని ఫొటోలు డైరెక్ట్‌గా డిలీట్ చేయడం సాధ్యమవుతుంది.

 Super Feature Launched In Google Photos , Google Photos , New Features , Latest News , Viral , New Updates , Delete Photos Directly-గూగుల్ ఫొటోస్‌లో లాంచ్ అయిన సూపర్ ఫీచర్.. ఇక నుండి ఆపని చాలా తేలిక-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్, IOS వెర్షన్ల గూగుల్ ఫొటోస్‌ యాప్‌లకు రిలీజ్ అయ్యింది.

ఫొటోలను క్లౌడ్ స్టోరేజ్ లో సేవ్ చేసుకునేందుకు చాలామంది యూజర్లు గూగుల్ ఫొటోస్‌ ఫ్లాట్‌ఫామ్‌నే ఎక్కువగా వాడుతుంటారు.

ఆల్బమ్ నుంచి నేరుగా ఫొటోలను డిలీట్ చేసే ఫెసిలిటీ గూగుల్ ఫొటోస్‌ వెబ్ వెర్షన్‌ లో చాలా ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది.ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్, IOS యూజర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రావడంతో ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయడం మరింత ఈజీగా మారబోతోంది.

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్ ప్రైవేట్ ఆల్బమ్‌ల్లోని ఫొటోలు లేదా వీడియోలు డిలీట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది.

అయితే షేర్డ్ ఆల్బమ్‌ ల్లోని మీడియాని మాత్రం డైరెక్ట్‌గా డిలీట్ చేయడం కుదరదు.గూగుల్ ఫొటోస్ యూజర్లు ‘మూవ్ టు ట్రాష్’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఆల్బమ్‌లలోని మీడియాను తొలగించవచ్చు.ఈ అప్‌డేట్‌కు ముందు, ఆల్బమ్ నుంచి మాత్రమే మీడియాను తీసివేయడం సాధ్యమయ్యేది.

సేవ్డ్ మీడియా నుంచి దాన్ని తొలగించడానికి, మెయిన్ ఫీడ్ లో మీడియాను సెర్చ్ చేసి డిలీట్ చేయాల్సి వచ్చేది.ఈ ప్రాసెస్ అనేది చాలా సమయంతో కూడుకున్న పని.ఆండ్రాయిడ్‌లో షేర్డ్ ఆల్బమ్‌ల విషయంలో మీడియా డిలీట్ చేసే ప్రాసెస్ ఇప్పటికీ అలాగే ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube