సన్ని లియోన్ షాకింగ్ నిర్ణయం

షాకింగ్ అంటే షాకింగ్ న్యూసే.ముద్దులకు నో అంటున్నది, ఏ దీపికా పదుకొనే, కరీనా కపూరో అనుకునేరూ .

 Sunny Leone Adopts No Kissing Policy-TeluguStop.com

సన్నిలియోన్ ముద్దు సన్నివేశాల పట్ల విముఖత చూపిస్తోంది.ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక్క సన్నివేశంలోనైనా, లిప్ లాక్ తో రెచ్చిపోయిన సన్ని ఇక నుంచి తన అధరాల్ని అప్పు ఇవ్వడం కష్టం అంటోంది.

సడెన్ గా సన్ని ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు.ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా చెలామణీ అవుతున్న దీపికా పదుకోనే, ప్రియాంక చోప్రా, జాక్వెలీన్ ఫెర్నాండెజ్, అలియా భట్, అందరూ ముద్దు సన్నివేశాల్ని మొహమాటం లేకుండా చేస్తున్నవారే.

అసలు సన్నికి ఇన్నిరోజులు, ఇన్ని అవకాశాలు వచ్చాయంటే కారణమే, అడ్డు చెప్పకుండా ముద్దు సీన్లు చేస్తుందని.ఒకవేళ తన కొత్త నిర్ణయానికే సన్ని కట్టుబడి ఉంటే, సన్ని సినిమా కెరీర్ మరెంతో కాలం కొనసాగదనేది బాలివుడ్ మేధావుల మాట.

హాట్ సీన్లు తక్కువ చేస్తానని కాని, బికిని సన్నివేశాలు వద్దని కాని చెబితే అదో అర్థం కాని, సన్నికి ఉన్న ఇమేజ్ కి ముద్దు సన్నివేశాలు చేయకపోతే నిర్మాతలు సన్ని మీద పెట్టుబడి ఎందుకు పెడతారని బాలివుడ్ క్రిటిక్స్ చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube