మెగస్టార్ చిరంజీవి,స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాని రూపొందించారు.
ఈ చిత్రం ఇటివల విడుదలై, మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ ని దక్కించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.సైరా మంచి విజయం అందుకోవడంతో టాలీవుడ్ కు చెందినా స్టార్ హీరోస్ తమ మాటలతో సైరా చిత్రంపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.

టాలీవుడ్ ప్రిన్సు మహేష్ బాబు, చిరంజీవి కి ఫోన్ చేసిమరి సినిమా పై తన అభిమానాన్ని చాటిచెప్పాడు.నాని కూడా సైరా విజయంపై మెగాస్టార్ కు విషెస్ తెలియజేశాడు.తాజాగా మన లెక్కల మాస్టర్ అదేనండి క్యాలికులేషన్ డైరక్టర్ సుకుమార్ సైరా పై ప్రశంసలు కురిపించాడు.సైరా చిత్రం చాలా అధ్బుతంగా ఉన్నది సురేందర్ రెడ్డి గారు ఉయ్యాలవాడ జీవిత చరిత్రను అధ్బుతంగా మలిచారు.
చిరంజీవి గారు చాలా బాగానటించారు.ప్రతి విషయంలో చిరంజీవి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటాను.
కన్నడ స్టార్ హీరో సుధీప్ గారు తన నటనతో కట్టిపడేశారు.రత్నవేలు గారి కెమెరా పనితనం చాలా బాగున్నది.
తెలుగు ప్రేక్షకులకు ఇంత మంచి సినిమాను అందించిన రామ్ చరణ్ కు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.