సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య.గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ కి హీరోగా నిలబడేందుకు ఈ సినిమా సహకరించింది.
ఇక అల్లు అర్జున్ తో సుకుమార్ ఆర్య 2 కూడా తీసి హిట్ అందుకున్నారు.ఇక ఇప్పుడు ఆర్య 3 సబ్జెక్ట్ రాసుకుంటున్న సుకుమార్ ఆ సినిమా కూడా అల్లు అర్జున్ తోనే తీస్తారని టాక్ వచ్చింది.
కాని ఆర్య 3 హీరోగా అల్లు అర్జున్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది.అల్లు అర్జున్ బదులుగా ఆర్య 3లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తాడని తెలుస్తుంది.
అర్జున్ రెడ్డి హీరోతో ఆర్య లాంటి సినిమా అబ్బో సుకుమార్ ఈసారి ఏదో మెగా ప్లాన్ వేసినట్టు ఉన్నాడని అనిపిస్తుంది.అయితే విజయ్ దేవరకొండతో ఆర్య 3 తీయడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
తీస్తే అల్లు అర్జున్ తోనే ఆర్య 3 తీయాలని అంటున్నారు ఫ్యాన్స్.ఇక విజయ్ దేవరకొండ మార్క్ ఆర్య 3 ఎలా ఉంటుందో చూద్దామని కొందరు సినీ ప్రేక్షకులు అంటున్నారు.
మొత్తానికి విజయ్ దేవరకొండతో ఆర్య 3 ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది.