తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ భాష, యాస, పాట లకు ప్రాధాన్యత పెరిగిందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.ఈనాడు సినిమాలలో హీరోల శ్వాసగా తెలంగాణ భాష మారిందన్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ బోట్ లో తెలంగాణ టూరిజం కాంట్రాక్టు ఉద్యోగులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుద్దాల అశోక్ తేజను ఘనంగా సన్మానించారు.తెలంగాణ భాష, పాట పెట్టకపోతే సినిమాలకి ఏమైనా ఇబ్బందేమో అని నిర్మాతలు ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆనాడు సినిమాల్లో జోకర్లకు, విలన్లకు ఉండే భాష ఇపుడు హీరో, హీరోయిన్ లకు వచ్చిందన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, అమరులు, ప్రజలు గొప్పతనానికి ఇది కారణమన్నారు సుద్దాల అశోక్ తేజ.