నాడు పశువులకు కాపలా.. నేడు దేశానికి కాపలా.. ఈ యువతి సక్సెస్ స్టోరీ వింటే షాకవ్వాల్సిందే!

మనలో చాలామంది కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని భావిస్తుంటారు.అయితే ఎక్కువమంది వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తే కొంతమంది మాత్రం దేశానికి సేవ చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు.

 Success Story Of Farmer To Army Officer Saranya Details, Sharanya, Sharanya Succ-TeluguStop.com

దేశంలో ఎక్కువమంది రైతులు, సైనికులను ఎంతగానో గౌరవిస్తారు.అబ్బాయిలు ఆర్మీ ఉద్యోగాలు( Army Job ) చేయడంలో ఆశ్చర్యం లేకపోయినా అమ్మాయిలు ఆర్మీ ఉద్యోగం చేస్తున్నారంటే మాత్రం ఆశ్చర్యానికి గురి కావాల్సిందేనని చెప్పవచ్చు.

ఒకప్పుడు పశువులకు కాపలా ఉన్న ఆ యువతి ఇప్పుడు దేశానికి కాపలా ఉండే స్థాయికి ఎదిగారు.తమిళనాడు రాష్ట్రంలోని( TamilNadu ) నంజమడైకుట్టై సక్సెస్ స్టోరీ తెలిస్తే మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురి కావాల్సిందేనని చెప్పవచ్చు.

తండాలో జన్మించిన శరణ్య ( Saranya ) చదువు కోసం రోజుకు రెండు గంటలు ప్రయాణం చేసేవారు.శరణ్య నివశించే తండా పశువుల పెంపకంపై జీవనం సాగించేది.

Telugu Job, Sharanya, Sharanya Story-Latest News - Telugu

శరణ్య కుటుంబం కూడా పశువుల పెంపకాన్నే వృత్తిగా చేసుకుంది.చిన్నప్పటి నుండి శరణ్యకు చదువంటే ఇష్టం కాగా ఇంట్లో అన్ని పనులు చేసిన శరణ్య పశువులకు కాపలా కూడా కాసేది.శరణ్యకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం.సివిల్ ఇంజనీరింగ్ చదివిన శరణ్యకు కాగ్నిజెంట్ లో ఉద్యోగం వచ్చింది.కబడ్డీపై ఉన్న ఇష్టంతో ఉద్యోగం వదులుకున్న శరణ్య ఆ తర్వాత మిలటరీపై దృష్టి పెట్టారు.

Telugu Job, Sharanya, Sharanya Story-Latest News - Telugu

ఆర్మీలో ఆఫీసర్ గా ఉద్యోగం సాధించిన శరణ్య ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.190 మంది అలాహాబాద్ లో రిపోర్ట్ చేయగా కేవలం ఐదుగురికి మాత్రమే ఉద్యోగం వచ్చింది.ఆ ఐదుగురిలో ముగ్గురు సైనిక కుటుంబాలకు చెందిన పిల్లలు కాగా మిగిలిన ఇద్దరిలో శరణ్య ఒకరు కావడం గమనార్హం.

శరణ్య సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.శరణ్యను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది యువతులు కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube