'సుబ్రమణ్యపురం' తో సుమంత్ ఖాతాలో హిట్ పడిందా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!

మూవీ టైటిల్: సుబ్రమణ్యపురం
నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బ తదితరులు
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాత: ధీరజ్, సుధాకర్

స్టోరీ:


సుబ్రమణ్యపురం లోని సుబ్రమణ్య స్వామి దేవాలయం చరిత్ర వివరిస్తూ ఈ సినిమా మొదలవుతుంది.వరుసగా ఆ ఊరిలో ఓ ఇద్దరు చనిపోతారు.

వరుసగా ఆ ఊరి ప్రజలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు.ఆ సమయంలో ఆ ఊరికి ఓ రీసెర్చ్ చేయడానికి సుమంత్ వస్తాడు.

ఈ ఆత్మహత్యల వెనకాల గల కారణాల్ని కనిపెట్టాలి అనుకుంటాడు.మరి చివరికి సుమంత్ కనిపెట్టాడలేదా తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే

రివ్యూ:


వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్.ఆయన హీరోగా, ఈషారెబ్బ హీరోయిన్‌గా.సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌ముడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం ‘సుబ్ర‌మ‌ణ్య‌పురం’.

సైన్స్‌కి అంద‌ని ఎన్నో ర‌హాస్యాలు మాన‌వ మేథ‌స్సుకు స‌వాళ్ళు విసురుతూనే ఉంటాయి.భ‌గ‌వంతుని మీద న‌మ్మ‌కం కూడా అలాంటిదే, ఆ న‌మ్మ‌కాన్ని ప్ర‌శ్నించే కార్తిక్ ప‌రిశోధ‌న‌లు ఎలాంటి నిజాల‌ను వెలుగులోకి తెచ్చాయి.? కాపాడ‌వ‌లసిన భ‌గ‌వంతుడి ఆగ్ర‌హం త‌ట్టుకోవ‌డం సాధ్యం అవుతుందా అనే ప్ర‌శ్న‌లకు స‌మాధానం ఈ సినిమా.

విలేజ్ నేటివిటీతో సినిమా ముందుకి వెళ్లడం కమర్షియల్ సినిమాలు నచ్చేవారికి అంతగా ఆకట్టుకోదు.సుమంత్, ఈషా తప్ప మిగిలిన కాస్టింగ్ అందరు అంతగా ఆకట్టుకోలేదు.చాలా వరకు సినిమా ఓపికకి పరీక్షపెడుతుంది.

సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు.

ప్లస్ పాయింట్స్:


స్టోరీ
సుమంత్
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్:


కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు
బోరింగ్ సన్నివేశాలు
ప్రొడక్షన్ వాల్యూస్

చివరగా: “సుబ్రమణ్యపురం”…,మీ ఓపికకి పరీక్ష పెట్టే చిత్రం

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube