చిన్నతనంలోనే తండ్రి మరణిస్తే ఆ కుటుంబానికి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.అయితే బాల్యంలోనే తండ్రి మరణించినా ఏడుకొండలు మాత్రం కష్టపడి లక్ష్యాన్ని సాధించారు.
పేదలకు చదువే బలమైన ఆయుధమని ఏడుకొండలు ప్రూవ్ చేశారు.పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా( Sri Potti Sriramulu Nellore ) పోలినేనివారిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు ఎస్సై ఉద్యోగం సాధించడం కోసం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.
తల్లి ఎంతో కష్టపడి చదివించడంతో ఏడుకొండలు సైతం మంచి ఉద్యోగం సాధించాలని రేయింబవళ్లు కష్టపడి చదివాడు.తాజాగా విడుదలైన ఎస్సై ఫలితాలలో 398వ ర్యాంక్ ను సాధించాడు.
స్వగ్రామంలోనే ఏడో తరగతి వరకు చదివిన ఏడుకొండలు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివాడు.ఏడుకొండలు మొదట టీచర్ కావాలని అనుకున్నాడు.
టీచర్ పోస్ట్ కోసం ఏడుకొండలు( Adukondalu ) కోచింగ్ తీసుకుని రెండుసార్లు డీఎస్సీలో లక్ ను పరీక్షించుకోగా రెండుసార్లు ఆశించిన ఫలితాలు రాలేదు.ఆ తర్వాత ఒకవైపు వ్యవసాయ పనులు చేస్తూనే మరోవైపు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఏడుకొండలు ఎస్సై జాబ్ సాధించడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.ఏడుకొండలు కోచింగ్ కు గ్రామానికి చెందిన కొంతమంది తమ వంతు సహాయం చేశారు.
తన సక్సెస్ గురించి ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ కష్టాలు ఉన్నాయని బాధ పడుతూ కుంగిపోతే చదువుకోవడం సాధ్యం కాదని ఇష్టపడి చదివితే మాత్రమే కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పేదలకు చదువే ఒక బలమైన ఆయుధమని పట్టుదలతో చదివి ఎస్సై జాబ్ సాధించానని ఏడుకొండలు చెప్పుకొచ్చారు.ఏడుకొండలు సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
భవిష్యత్తులో ఎస్సై ఏడుకొండలు కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.