వావ్, చాలామందిని ఆకట్టుకుంటున్న లెటర్ కిట్.. వీడియో వైరల్..

ఇప్పుడంటే కంప్యూటర్ లో టైప్ చేయగానే వెంటనే ప్రింట్ అవుట్ తీయడం కుదురుతుంది కానీ ఆ కాలంలో ఈ ఫెసిలిటీలేవీ ఉండేవి కాదు.కానీ చక్కగా లెటర్స్ ప్రింట్( LetterS print ) అవ్వడానికి కొన్ని పరికరాలు వాడేవారు.

 The Letter Kit That Is Impressing Many.. The Video Is Viral., Leroy Lettering-TeluguStop.com

వాటిలో ఒకటి లెరోయ్ లెటరింగ్ కిట్.టెక్నికల్ ఆర్టిస్టులు డ్రాయింగ్స్‌పై కచ్చితమైన, యూనిఫామ్ లెటర్స్ రూపొందించడానికి ఈ డివైస్ ఉపయోగపడేది ఇది ఎలా పని చేస్తుందో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది చూసి అప్పటి వారి ఆవిష్కరణకు చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

1933లో H.లెరోయ్‌ దీనిని కనుగొన్నారు.1980ల వరకు మెషిన్ పార్ట్స్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్‌లు, మ్యాప్‌లు, ఇతర వాటిపై అక్షరాలను రాయడానికి వీటిని ఉపయోగించారు.లెరోయ్ లెటరింగ్ కిట్‌లో టెంప్లేట్‌లు ఉన్నాయి, ఒక్కొక్కటి వేర్వేరు ఫాంట్ సైజు, స్టైల్‌తో వస్తాయి.మూడు చేతులతో పనిచేసే పెన్ లాంటి టూల్ స్క్రైబర్ కూడా ఉంటుంది.

మొదటి చేయి టెంప్లేట్‌కు జోడించబడింది, రెండవ చేయి ఒక సౌకర్యవంతమైన కేబుల్ ద్వారా మొదటి చేతికి కనెక్ట్ చేయబడింది., స్క్రైబర్‌ను పట్టుకుంది.మూడవ చేయి ఒక గైడ్, ఇది డ్రాయింగ్ బోర్డ్ అంచున ఉంటుంది, స్క్రైబర్ సరైన లైన్‌లో కదులుతున్నట్లు నిర్ధారిస్తుంది.

లెరోయ్ లెటరింగ్ కిట్‌( Leroy lettering kit )ను ఉపయోగించడానికి, కళాకారుడు కావలసిన ఫాంట్‌తో టెంప్లేట్‌ను ఎంచుకుని డ్రాయింగ్ బోర్డ్‌లో ఉంచుతారు.అప్పుడు, ఆర్టిస్ట్ స్క్రైబర్‌ను హోల్డర్‌లోకి చొప్పించి, ఒత్తిడి, సిరా ప్రవాహాన్ని అడ్జస్ట్ చేస్తాడు.లెరోయ్ లెటరింగ్ కిట్ ఎలా పని చేస్తుందో వైరల్ వీడియోలో మీరు చూడవచ్చు.

కింద అక్షరాల ముద్రణ ఉండగా, వాటిలో పెన్ లాంటి దాన్ని తిప్పుతూ ఉంటే పైన మరొక పెను లాంటిది పేపర్‌పై అక్షరాలు రాస్తూ ఉంది.ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని వీడియో చూసిన వారి పేర్కొంటున్నారు, ఇది తమ ఇంట్లో ఉంటే బాగుండు అని మరికొందరు.@Rainmaker1973 ట్విట్టర్ పేజీ షేర్ చేసిన దీనిపై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube