మగవారు ఆడవారి కళ్లు, వారి పెదవులపై చిరునవ్వు, ముఖ సౌందర్యం చూసి అట్రాక్ట్ అవుతుంటారు.వీటితోపాటు ఒక్కొక్కరూ ఆడవారిలో( Women ) ఒక్కో లక్షణాన్ని మెచ్చుకుంటుంటారు.
కొందరు ఆడవారి పాదాలకు మరింత ఆకర్షితులవుతారు.సాధారణంగా గర్ల్స్ తమ పాదాల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారు.
పద్మాల వంటి కోమలమైన పాదాలను( Feet ) వారు మెయింటైన్ చేస్తారు.అందుకే వాటిని చూసి మగవారు ముచ్చట పడుతుంటారు.
అయితే గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్ పాదాలను చూస్తే పర్లేదు కానీ ఇతర ఆడవారి పాదాలను చూసేందుకు ప్రయత్నించకూడదు.ముఖ్యంగా స్నేహితుడికి లవర్‌ను అలా చూడటం చాలా తప్పు.
కానీ ఒక యువకుడు ఆ తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సీసీటీవీ ఇడియట్స్ ఈ వీడియోను షేర్ చేయగా దీనికి ఇప్పటిదాకా 2 కోట్ల 85 లక్షల వ్యూస్ వచ్చాయి.మూవీ నైట్ విత్ ఫ్రెండ్స్ అని ఈ వీడియో కింద రాయడం మనం చూడవచ్చు.
వీడియోలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి సోఫాలో కూర్చుని సినిమా చూస్తూ ఉండడం మనం గమనించవచ్చు.ఈ ఫ్రెండ్స్ లో ఒకరు తన గర్ల్ ఫ్రెండ్ ని( Girl Friend ) కూడా తెచ్చుకున్నారు.
ఆమె తన బాయ్ ఫ్రెండ్ ఒడిలో కాళ్లు పెట్టుకొని దర్జాగా సినిమా చూస్తోంది.అయితే ఆమె పాదాలను చూసి ముచ్చట పడిన ఫ్రెండ్ తన ఫోన్‌లో ఫోటో తీసుకుందామనుకున్నాడు.
సరిగ్గా ఆమె పాదాల వైపు ఫోన్ కెమెరా పెట్టి క్లిక్ మనిపించాడు.అయితే ఆ సమయంలో ఫ్లాష్( Flash ) ఆన్ చేసి ఉంది.అది గ్రహించిన అతడు వెంటనే తన ఫోన్ కింద పెట్టేశాడు కానీ అప్పటికే అందరూ ఈ విషయాన్ని గమనించారు.ఆ గర్ల్ ఫ్రెండ్ ఆశ్చర్యపోయి ఏం ఫోటో తీస్తున్నావ్ అంటూ వెంటనే తన కాళ్ళను అక్కడ నుంచి తీసేసింది.
బాయ్ ఫ్రెండ్ నవ్వేశాడు, పెద్దగా సీరియస్ అవ్వలేదు.ఈ వీడియో చూసిన కొంతమంది “అమ్మాయి పాదాలు( Girls Feet ) అంటే అంత పిచ్చి ఎందుకు?” అని కామెంట్ చేస్తున్నారు.మరి కొందరు అయ్యో పాపం అంటున్నారు.ఇంకొందరు మాత్రం ఇలా సీక్రెట్ గా ఫోటోలు తీసే వారితో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.