టెస్టుల్లో 1000 ఫోర్లు పూర్తిచేసిన స్టీవ్ స్మిత్.. విరాట్ కోహ్లీ ఏ స్థానంలో ఉన్నాడంటే..?

యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా( Australia )మధ్య టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన స్టీవ్ స్మిత్ రెండవ టెస్ట్ మ్యాచ్ తో 1000 ఫోర్లు బాదిన ఘనత సాధించాడు.

 Steve Smith  Completed 1000 Fours In Tests.. Where Is Virat Kohli..? , Steve Smi-TeluguStop.com

లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది.మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 371 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.స్టీవ్ స్మిత్(Steve Smith ) తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు కొట్టాడు.రెండవ ఇన్నింగ్స్ లో 34 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు కొట్టాడు.దీంతో టెస్ట్ మ్యాచ్లలో 1004 ఫోర్లు పూర్తిచేసిన సరికొత్త రికార్డు సాధించాడు.

అయితే ఫోర్లు కొట్టడంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్( Virat Kohli ) అంటే చాలా వెనుకబడి ఉన్నాడు.స్టీవ్ స్మిత్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడిన కోహ్లీ ఇంకా వెనుకబడే ఉన్నాడు.

స్టీవ్ స్మిత్ 99 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1004 ఫోర్లు బాదాడు.విరాట్ కోహ్లీ 109 టెస్ట్ మ్యాచ్లు ఆడి 950 ఫోర్లు బాదాడు.

Telugu Australia, India, Latest Telugu, Tendulkar, Steve Smith, Virat Kohli-Spor

కానీ టెస్ట్ మ్యాచ్ లలో అత్యధిక ఫోర్లు బాదిన రికార్డ్ భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ( Sachin Tendulkar )పేరిట ఉంది.సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు 200 టెస్ట్ మ్యాచ్లు ఆడి 2058 ఫోర్లు కొట్టాడు.టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ 69 సిక్సర్లు బాదాడు.ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సచిన్ టెండుల్కర్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

Telugu Australia, India, Latest Telugu, Tendulkar, Steve Smith, Virat Kohli-Spor

ఈ జాబితాలో అత్యధిక ఫోర్లు కొట్టి రెండవ స్థానంలో భారత జట్టు మాజీ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్ నిలిచాడు.రాహుల్ ద్రావిడ్ 164 టెస్టులలో 1654 ఫోర్లు కొట్టాడు.ఇతను టెస్టులలో 21 సిక్సర్లు బాదాడు.సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ లు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వారి స్థానాలను ఇతర ఆటగాళ్లు ఇప్పటివరకు బద్దలు కొట్టలేకపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube