బాలయ్య వల్ల బరువు పెరిగానంటున్న స్టార్ హీరోయిన్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ గారు నటించిన సినిమాలలో హీరోయిన్ గా చేయాలంటే వారికి అందంతో పాటు ఎంతో అభినయం, డాన్స్, గ్లామర్ అన్నీ ఉండాలి.అందుకోసమే బాలకృష్ణ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ హీరోయిన్స్ కి అవకాశం ఇస్తుంటారు.

 Star Heroine Gaining Weight Due To Balakrishna, Balakrishna, Thanusree Dutt , We-TeluguStop.com

సినిమాలలో హీరోయిన్స్ ను ఎంతో ఆటపట్టించే బాలకృష్ణ తెరవెనుక ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు.అలాంటి బాలకృష్ణ తో దాదాపు 15 ఏళ్ల క్రితం నటించిన వీరభద్ర సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ తను శ్రీ దత్త ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

అంతే కాకుండా బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే చాలా అవుతారనే ఆశక్తికర విషయాలను వెల్లడించారు.

తను శ్రీ దత్త తెలుగులో నటించినది కేవలం ఒకే ఒక్క సినిమా.

అది కూడా బాలకృష్ణ గారితో వీరభద్ర సినిమాలో నటించి మరిన్ని అవకాశాల కోసం బాలీవుడ్ వైపు వెళ్ళింది.అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో, తిరిగి తను టాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది.

టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడుతోంది.

Telugu Balakrishna, Thanusree Dutt, Veerabadra-Movie

బాలీవుడ్ కంటెంట్ కంటే టాలీవుడ్ ఎంతో బెటర్ అని, తనకు మంచి గుర్తింపు తెచ్చింది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ అని ఆమె పేర్కొన్నారు.అంతే కాకుండా బాలకృష్ణ సినిమాలో నటించడం వల్ల ఐదు కిలోలు బరువు పెరిగానని ఈ సందర్భంగా తను శ్రీ దత్త తెలిపారు.బాలకృష్ణతో సినిమా చేసే సమయంలో అతనికి భోజనం ఇంటి నుంచి వచ్చేది.

ఆ భోజనం తినడం వల్ల ఐదు కిలోల బరువు పెరిగానని ఈమె తెలిపారు.

ప్రస్తుతం తను శ్రీ దత్త టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.

కంటెంట్ నచ్చితే తెలుగులో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.హీరోయిన్ గానే కాకుండా, విలన్ వదిన పాత్రలో నటించడానికి కూడా ఆమెకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు.

ఈ విధంగా 15 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube