తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.( Ram Charan ) చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి సమయంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేయాల్సిన ఒక సినిమాను వేరే హీరో చేశాడనే విషయం చాలా మందికి తెలియదు.
ముఖ్యంగా నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ సినిమాను( Josh Movie ) రామ్ చరణ్ చేయాల్సింది కానీ రామ్ చరణ్ అప్పుడు మగధీర సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు.అలా రామ్ చరణ్ చేయాల్సిన సినిమాని నాగచైతన్య చేశాడు.
అలాగే నాగ చైతన్య చేయాల్సిన ఒక సినిమాని రామ్ చరణ్ చేశాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు.
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే ‘( Govindudu Andarivadele ) సినిమా స్టోరీ ని కృష్ణ వంశీ మొదట నాగచైతన్య కి చెప్పాడట.అప్పుడు నాగచైతన్య కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉండడంవల్ల తను ఆ ప్రాజెక్టుని చేయలేకపోయాడు.ఇక అంతలోనే చిరంజీవి కృష్ణవంశీని పిలిచి రామ్ చరణ్ కి సెట్ అయ్యే కథను చెప్పమని అడగగా, గోవిందుడు అందరివాడేలే సినిమా స్టోరీ చెప్పి రామ్ చరణ్ ని లాక్ చేసాడు.
ఇక అలా నాగచైతన్య చేయాల్సిన సినిమాను రామ్ చరణ్.రామ్ చరణ్ చేయాల్సిన సినిమా నాగచైతన్య చేశారు…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.అలాగే బుచ్చిబాబు సన డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడు…ఇక వీటితో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.