స్టార్ హీరో బాలకృష్ణ సినిమా రంగంలో వరుస విజయాలు సాధించడంతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకోవడం ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు పొందారనే సంగతి తెలిసిందే.స్టార్ హీరో బాలకృష్ణ ఈ స్థాయికి ఎదగటానికి ఆయన కృషి, పట్టుదల కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.
బాలయ్య గురించి సన్నిహితులు, సెలబ్రిటీలు చెప్పే మాటలు ఏంటంటే బాలయ్య భోళా మనిషి అని ఇతరులను గుడ్డిగా నమ్ముతారని చెబుతారు.
అదే సమయంలో తను నమ్మిన వాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకునే విషయంలో బాలయ్య ముందువరసలో ఉంటారు.
బాలయ్య ఫ్యాన్స్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.అదే సమయంలో తన అభిమానులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయం చేయడానికి బాలయ్య వెనుకాడరు.
సినిమా సెలబ్రిటీలలో చాలామంది పబ్లిసిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.ఈ విషయంలో మాత్రం బాలయ్య ఇతరులకు భిన్నమని చెప్పవచ్చు.
బాలయ్య చేసే సేవాకార్యక్రమాలు ఇతరుల ద్వారా ప్రచారంలోకి వస్తాయే తప్ప బాలయ్య నోరు తెరిచి చెప్పిన సందర్భాలు మాత్రం చాలా తక్కువని చెప్పవచ్చు.సినిమా రంగంలో టాలెంట్ ఉన్న ఎంతోమంది దర్శకులను బాలయ్య ప్రోత్సహించారు.రెమ్యునరేషన్ విషయంలో కూడా బాలయ్య పట్టింపులకు పోరు అని తన సినిమాల వల్ల నష్టం వస్తే నిర్మాతలను ఆదుకునే విషయంలో బాలయ్య ముందువరసలో ఉంటారని ఇండస్ట్రీలో పేరుంది.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే బాలయ్య పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నా బాలయ్య కావాలని ఎప్పుడూ వివాదాలను సృష్టించుకోలేదు.
బాలయ్య ఎప్పుడూ ఇతరులకు మంచి చేయాలని ఆలోచించే హీరోలలో ముందువరసలో ఉంటారు.స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.