ఆ హీరోయిన్ ఏమైపోయింది.ఏ హీరోయిన్ బాసు.
అదేనండి అల్లు అర్జున్ ప్రభాస్ సరసన నటించిన ఆ హీరోయిన్ ఏమైపోయింది.ఆ ఇద్దరు హీరోల సరసన చాలా మంది హీరోయిన్లు నటించారు మీరు ఏ హీరోయిన్ గురించి అడుగుతున్నారు.మీకు గుర్తుకు రావట్లేదా అయితే కాస్త డిజిటల్ గాని ఆ హీరోయిన్ గురించి తెలుసుకుందాం.2009 ఫెమీనా అందాల పోటీల్లో ఫైనల్ లిస్ట్ తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.మంచి విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది.కానీ ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ అంటే దీక్షాసేత్.
మిరపకాయ సినిమాలో రవితేజతో కలిసి నటించిన దీక్షాసేత్ అల్లు అర్జున్ తో వేదం సినిమాలో నటించింది.
ప్రభాస్కు జోడిగా రెబల్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇలా అందం అభినయం విషయంలో ఎక్కడ ఏ హీరోయిన్ కు తీసిపోనీ దీక్షాసేత్ ఇక తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది.కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయింది.
దీంతో దీక్షాసేత్ ఏమైంది అన్న చర్చ అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ ఉంటుంది అని చెప్పాలి.

తెలుగులో సరిగ్గా అవకాశాలేమి రాకపోవడంతో హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకుంది దీక్షాసేత్.2014లో లెకర్ హమ్ దీవానా దిల్ అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగా.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఆ తర్వాత వచ్చిన జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అదే సంవత్సరం హిందీలో ఒక సినిమా చేసింది.
ఇక.ఇదే దీక్షాసేత్ చివరి చిత్రం కావడం గమనార్హం.ఇక ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైంది ఈ అమ్మడు.ఎక్కడికివెళ్ళింది ఏంచేస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండదు దీక్షాసేత్.ఈ అమ్మడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు.







