టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారనే సంగతి తెలిసిందే.పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమా కూడా సక్సెస్ సాధిస్తే బాక్సాఫీస్ ను రూల్ చేసే హీరోల జాబితాలో బన్నీ ముందువరసలో ఉంటారు.
సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న బన్నీ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే అల్లు అర్జున్ కొడుకు ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు మాత్రం ఒకరు కాకుండా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ రెండు పేర్లలో బన్నీ పేరు మాత్రం లేదు.కొన్నేళ్ల క్రితం కుటుంబ సభ్యులు నీ ఫేవరెట్ హీరో ఎవరని అడగగా మహేష్ బాబు ( Mahesh Babu ) పేరు చెప్పి అల్లు అయాన్( Allu Ayan ) అందరినీ ఆశ్చర్యపరిచారు.
మరో హీరో రామ్ చరణ్ అంటే కూడా అల్లు అయాన్ కు చాలా ఇష్టమని సమాచారం.
చరణ్( Ram Charan ) సినిమాకు సంబంధించి సాంగ్స్ విడుదలైతే అయాన్ చరణ్ కొత్త సినిమా విడుదలయ్యే వరకు ఆ పాటలే వింటారట.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రంగస్థలం సినిమాలో చరణ్ గెటప్ చూసిన అయాన్ లుంగీ షర్ట్ కావాలని బన్నీని కోరారు.రామ్ చరణ్ ఒక సందర్భంలో ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.
చరణ్, బన్నీ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
బన్నీ, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎవడు మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ కాంబినేషన్ లో చరణ్ అర్జున్ పేరుతో ఒక టైటిల్ ను చాలా సంవత్సరాల క్రితమే రిజిష్టర్ చేయగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.