సోహెల్ ( Sohel ) పరిచయం అవసరం లేని పేరు.బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇప్పటికే ఈయన నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోయినప్పటికీ ఈయన మాత్రం అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.
తాజాగా సోహెల్ నటిస్తున్నటువంటి చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్( Mr.pregnant ) .శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాలో సోహెల్ రూప హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఈ సినిమా ఆగస్టు 18 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.ఇందులో భాగంగా సోహైల్ ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్నటువంటి అవమానాల గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ లైఫ్ లో ముందుకెళ్లాలి.యాక్సెప్ట్ చేస్తారా లేదా ఒక రియాలిటీ షో నుంచి వచ్చాడు చిన్న స్క్రీన్ పైనుంచి వచ్చాడు అని అందరూ అంటూ ఉంటే కాస్త భయమేసింది అని తెలిపారు.ఇక మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా తాను యాక్సెప్ట్ చేసినప్పుడు అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్ విడుదల చేసినప్పుడు చాలామంది నన్ను హేళనగా మాట్లాడారని తనని అవమానించారని చెప్పారు.వీడేంది చాలా తేడాగా ఉన్నారు అంటూ నన్ను అవమానించారని ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.