టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి( Srimukhi ) యాంకరింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.శ్రీముఖి ఏ షోకు హోస్ట్ గా చేసినా ఆ షో ప్రేక్షకులను మెప్పిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కుటుంబ సభ్యుల విషయంలో శ్రీముఖి ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.తాజాగా శ్రీముఖి పేరెంట్స్ కు ఖరీదైన బహుమతిని( expensive gift ) ఇవ్వగా శ్రీముఖి మనస్సు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నిజామాబాద్( Nizamabad ) ముద్దుబిడ్డ శ్రీముఖి నిజామాబాద్ లోని కొత్తింట్లో దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.దీపావళి పండుగ సందర్భంగా శ్రీముఖి ఇంట్లో పూజ చేసి అతిథులకు స్వీట్లు పంచారు.
తల్లి లతకు ( Mother Lata )వజ్రాల ఆభరణాన్ని తండ్రి రామకృష్ణకు( Ramakrishna ) చైన్ ను శ్రీముఖి బహుమతిగా ఇచ్చారు.ఊహించని బహుమతులను శ్రీముఖి ఇవ్వడంతో తల్లీదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
శ్రీముఖి మాట్లాడుతూ ఒకప్పుడు మాది మధ్యతరగతి కుటుంబమని ఒకే గదిలో అంతా ఉండేవాళ్లమని ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ఈరోజు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి జరుపుకుంటున్నామంటే అందుకు నా తల్లీదండ్రులే కారణమని శ్రీముఖి తెలిపారు.మాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు వారికి చిన్న బహుమతి ఇచ్చామని చెబుతూ శ్రీముఖి వాళ్ల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇది చూసిన నెటిజన్లు శ్రీముఖి మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెబుతున్నారు.శ్రీముఖికి కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.శ్రీముఖి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.శ్రీముఖి కెరీర్ పై దృష్టి పెడితే ఆమె మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీముఖి రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందనే సమాచారం అందుతోంది.