కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, పపంచ వ్యాప్తంగా అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంను ప్రతీ రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.ఇక శ్రీనివాసుడు కళ్యాణం రోజున తిరుపతిలో ఇసుక వేస్తె రాలనంతతి జనం వస్తారు.
ఇతర రాష్ట్రాల నుంచీ తిరుపతికి వచ్చే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.అయితే విదేశాలలో ఉన్న ఎన్నారైలు తమ సొంత ప్రాంతాలకు వచ్చినపుడు తప్ప శ్రీనివాసుడు దర్సన భాగ్యం కుదరదు, అందుకే విదేశాలలో ఉన్న ఎన్నారై భక్తుల కోసం స్వామి వారిని ఆయా దేశాలకు తీసుకువెళ్ళి మరీ అక్కడ కళ్యాణ మహోశ్చవాలు నిర్వహిస్తుంటారు.
ఈ క్రమంలోనే.
అమెరికాలోని తెలంగాణా పీపుల్ అసోసియేషన్ డాలస్ లో శ్రీనివాసుడు కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డాలస్ లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ లో తెలుగువారి ఆధ్వర్యంలో సుప్రభాతం, తోమాల సేవ, అభిషేకం, కళ్యాణ సేవలను నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.జూన్ 25 వ తేదీన చేపడుతున్న ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి హారవుతున్నారని టిపాడ్ సంస్థ సభ్యులు తెలిపారు.
స్వామి వారి కళ్యాణంను వైభవోపేతంగా నిర్వహిచేందుకు గాను తిరుమల తిరుపతి నుంచీ అర్చక స్వాములను, దేవతా మూర్తుల విగ్రహాలను స్వయంగా వెంటబెట్టుకుని వైవి సుబ్బారెడ్డి అమెరికాకు విచ్చేస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వసతులను ఏర్పాటు చేస్తున్నామని టిపాడ్ ప్రతినిధులు తెలిపారు.25 న జరగనున్న స్వామీ వారి కళ్యాణానికి వచ్చే ప్రతీ ఒక్కరికి స్వామీ వారి లడ్డూ , వస్త్రం అందజేస్తామని అలాగే పూజలలో పాల్గొనేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాలకోసం tpadus.org ని సంప్రదించవచ్చునని కమిటీ సభ్యులు ప్రకటించారు
.